మార్కాపురం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జనగణన పై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన గణన పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మూడు విడతలగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 132 మంది ఎన్యూమానేటర్లు 6 మందికి ఒక సూపర్వైజర్ ను నియమించినట్లు తెలిపారు. వారందరికీ మూడు విడుదలగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. జన గణన రెండు విడుదలగా జరుగుతుందన్నారు. మొదటి విడత మే ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు గృహాల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వీయ గణన నిర్వహిస్తున్నామన్నారు.