కొండపి: జరుగుమల్లి కే బిట్రగుంట గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామ సమీపంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు చనిపోయి చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.