కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్రర్లు ఏర్పాటు చేసిన పోలీసులు
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూలమలుపుల వద్ద పోలీసులు గురువారం మిర్రర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మిర్రర్లు ఏర్పాటు చేశామని వాహనదారులు ఈ మిర్రర్లు వినియోగించుకొని ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మలుపుల వద్ద మిర్రర్లలో వాహనాలు కనిపిస్తాయని వాహనదారులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు.