తాడిపత్రి: పెద్దపప్పూరు లో అత్యంత ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
పెద్దపప్పూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు తరలివచ్చారు. సీతారాముల కళ్యాణాన్ని భక్తులు దగ్గరుండి వీక్షించారు. ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.