మార్కాపురం: పూల సుబ్బయ్య కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీలు అద్దాలు పాలుగొట్టిన గంజాయి మత్తులో ఆకతాయిలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో గంజాయి మత్తులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పూల సుబ్బయ్య కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీల అద్దాలు పగలగొట్టారు అంతేకాకుండా నీటిని పంపింగ్ చేసే మోటర్ ను అపహరించారు. రాత్రి సమయాలలో హాస్పటల్ పైకి వెక్కి మూత్ర విసర్జన చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.