దర్శి: దర్శిలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు, ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రంజాన్ సందర్భంగా వాయిదా పడ్డ ఇంగ్లీష్ పరీక్షను గురువారం విద్యార్థులు ప్రశాంతంగా రాశారు. ఇన్ని రోజుల ఒత్తిడికి గురైన విద్యార్థులకు ఒకసారిగా ఉపశమనం లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.