రాయదుర్గం: జె. వెంకటాంపల్లి గ్రామంలో జఠిలమవుతున్న తాగునీటి సమస్య, సమస్య తీర్చాలని మహిళల డిమాండ్
గుమ్మగట్ట మండలంలోని జె. వెంకటాంపల్లి గ్రామంలో తాగునీటి సమస్య జఠిలమవుతోంది. దీనివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని గ్రామానికి చెందిన మహిళలు గురువారం మాట్లాడుతూ తెలిపారు. గ్రామంలో రెండు బోర్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. గత 6 నెలల క్రితం వచ్చిన వర్షానికి గ్రామానికి వెళ్లే రోడ్డులో కల్వర్టు బ్రిడ్జి కూలిపోయింది. ఆ బ్రిడ్జి కిందనే తాగునీటి పైపు లైన్ వెళుతుంది. బ్రిడ్జి కూలిపోవడంతో పైప్ లైన్ డ్యామేజ్ కాగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రిపేరి చేశారు. అయితే అప్పటి నుంచి ఏ కొద్ది పాటి వర్షం వచ్చినా పైప్ లైన్ పగిలి నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు తెలిపారు.