కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రంలో మానవ సంబంధాలు, సామాజిక విలువల ఇతివృత్తంతో కూడిన నాటక ప్రదర్శన
బ్రహ్మసముద్రంలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మానవ సంబంధాలు, సామాజిక విలువల ఇతి వృత్తంతో కూడిన నాటకాన్ని ప్రదర్శించారు. కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని బహిర్గతం చేశారు. నాటక ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకర్షించింది. మానవ సంబంధాలు, సామాజిక విలువలను పెంపొందించే విధంగా నాటక ప్రదర్శన కొనసాగింది. అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.