గిద్దలూరు: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై గిద్దలూరులో తీవ్ర అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, నిత్యవసరలపై ఎఫెక్ట్
వాహనదారులకు భారీ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరిగాయి. గిద్దలూరులో సోమవారం ఉదయం 6 గంటల నుంచి లీటర్ పెట్రోల్ పై రూ. 2.84 లు, డీజిల్ పై రూ.2.86 పెరగడంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర.రూ.118.14 లు, డీజిల్ ధర రూ. 105.77లు గా నమోదయింది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరల ప్రభావం వలన నిత్యవసర ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు.