రాయదుర్గం: మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం పై అధికారులను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించబోనని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్షించి, ఇరుశాఖల మధ్య సమన్వయ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుమార్చి లేదా మూడు రోజులకోసారి నీరు ఇవ్వాల్సి ఉండగా 7-8 రోజులకు కూడా ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. సోమవారం నుంచి సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, ప్రజల ముందే అధికారులను నిలదీస్తానని, నిర్లక్ష్యం కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.