గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద నిలచి పోయిన ట్రాఫిక్
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా పోటెత్తారు. వాహనాలు కూడా భారీగా రావడంతో రాకపోకలు స్తంభించాయి. వెంటనే సమాచారాన్ని అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని పునర్ధరించారు. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చినట్లు తెలుస్తోంది. భక్తులు దైవదర్శనం చేసుకునేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది అని భక్తులు తెలిపారు.