కనిగిరి: పట్టణంలో చోరీకి గురైన రూ.3 లక్షల విలువ చేసే బంగారు నగలు రికవరీ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ
కనిగిరి: దొంగతనానికి గురైన బంగారు వస్తువులను రికవరీ చేసిన పోలీసులకు బాధ్యత మహిళ కృతజ్ఞతలు తెలిపిన సంఘటన కనిగిరి పోలీస్ స్టేషన్లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 6వ తేదీన తమిళనాడులోని తంజావూరు జిల్లా భీమ్ రావు నగర్ కు చెందిన చియాద్రి ఆదిలక్ష్మి అనే మహిళ తన పెదనాన్న దశదినకర్మలో పాల్గొనేందుకు కనిగిరిలోని శంఖవరం కు వచ్చింది. బ్యాగులో రూ .3లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలను ఉంచగా, ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు శంకవరం కు చెందిన సుప్రియ అనే మహిళ దొంగిలించినట్లు గుర్తించి, నగలను రికవరీ చేశారు. బాధ్యత మహిళా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.