కనిగిరి: పట్టణ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తాం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు, బీసీ కాలనీ, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్లు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. కనిగిరి పట్టణంలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.