కనిగిరి: పామూరులో అంగరంగ వైభవంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట భజనలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.