కనిగిరి: పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ధర్నా, ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని డిమాండ్
కనిగిరి పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు శనివారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. ధర్నా కార్యక్రమంలో యుటిఎఫ్ ,ఎస్ టి యు, బి టి ఏ , వైయస్సార్ టీఎఫ్ తదితర సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ వల్ల అంతగా అవగాహన లేని ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. మాన్యువల్ విధానంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.