దర్శి: తూర్పు గంగవరం గ్రామంలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు గ్యాస్ కంపెనీ వద్ద బారులు తీరిన స్థానికులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం గ్యాస్ లోడ్ రావడంతో ప్రజలు కంపెనీ వద్ద బారులు తీరారు. ఎండలో గ్యాస్ కోసం కంపెనీ గేటు బయట నిల్చున్నారు. దీంతో రోజు రోజుకు గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయోనని స్థానికులు తెలిపారు.