గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో భయంకరంగా మారిపోయిన వాతావరణం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఉరుములు పిడుగులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన నల్లటి మబ్బులు, ఉరుములు పిడుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు చిరుజల్లులు ఉపశమనం కలిగించాయి. అయితే ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు మెరుపులు పిడుగులు ఆందోళనకు గురిచేశాయి.