రాయదుర్గం: ఆర్థిక స్వావలంబనతోనే పేదరిక నిర్మూలన : రాయదుర్గం ఎమ్మెల్యే
మహిళల ఆర్థిక స్వావలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఐకెపి వెలుగు ఆధ్వర్యంలో రాయదుర్గం డ్వామా హాల్ లో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా యానిమేటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ, ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు మంజూరు ధ్రువపత్రాలు అందజేశారు. చంద్రబాబు నాయకత్వంలో మహిళా సంఘాల సభ్యులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు.