గిద్దలూరు: కొమరోలు మండలం అల్లినగరంలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో పేకాట ఆడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1,44,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టానికి నేరమని ఎస్ఐ నాగరాజు ప్రజలను హెచ్చరిస్తున్నారు.