వికారాబాద్: జిల్లాలో పిల్లలను అపహరించే గ్యాంగ్ సంచరిస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు: ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పిల్లలను అపహరించే గ్యాంగ్ సంచరిస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎస్పీ కోటి రెడ్డి అన్నారు. దయచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా మెసేజులు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టవద్దని ఎస్పీ సూచించారు. అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపిస్తే పోలీస్ అధికారులను సంప్రదించాలని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని ఎస్పీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.