వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ పరీక్షకు 152 మంది గైర్హాజరు: జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్
వికారాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7849 మంది హాజరు కావలసి ఉండగా, 7697 మంది పరీక్ష రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్నాయని, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా శంకర్ సూచించారు.