వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 216 మంది గైర్హాజరు: జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్
వికారాబాద్ జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 216 మంది గైర్హజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 6788 మంది హాజరు కావాల్సి ఉండగా 6,572 మంది పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.