వికారాబాద్: గోవులు, గేదెలకు మార్చి నెలాఖరు వరకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ: జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి
గోవు, గేదె జాతి పశువులలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మార్చి నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 54 బృందాలతో పశు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మూడు నెలల వయసు పైబడిన పశువులన్నింటికీ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.