వికారాబాద్: సైన్స్ తోనే మానవ మనుగడ,దేశాల అభివృద్ధి - వికారాబాద్ డిఎస్పి అంజయ్య.
సైన్స్ తోని మానవ మనుగడ దేశాల అభివృద్ధి ముడిపడి ఉందని వికారాబాద్ డిఎస్పి అంజయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా,ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటుచేసిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలను పరిశీలించారు.