గిద్దలూరు: కొమరోలు మండలం ఎర్రగుంట్లసమీపంలో నాటుసార తయారు చేస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించి ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నాటుసార తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి పాల్పడే వారిని గుర్తించే పనిలో ఉన్నామని నాటు సారా తయారు చేయటం విక్రయించడం చట్టరీత్యా నేరమని గిద్దలూరు ఎక్సైజ్ సీఐ జయరావు ప్రజలను హెచ్చరించారు.