యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లాలో డీజిల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలో నిలబడిన వాహనదారులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో డీజిల్ కొరత తీవ్రమైంది పట్టణంలోని కొన్ని బంకుల్లో స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టడంతో సోమవారం వాహనదారులు బంకులకు వచ్చి వెను తిరుగుతున్నారు. డీజిల్ ఉన్న మరికొన్ని బంకులకు వాహనదారులు కిలోమీటర్లు మేరా బారులు తీరారు. ఇంధనం నింపుకునేందుకు డబ్బాలను సైతం వెంట తెచ్చుకొని క్యూలో నిలబడుతున్నారు. దీంతో వాహనదారులు అసహనానికి గురవుతున్నారు.