మార్కాపురం: జనాభా గణన సమగ్రంగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2027 జనాభా గణనను సమగ్రంగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ప్రధాన జనాభా గణన అధికారి విజయ సునీత తెలిపారు. మొదటి దశ ఇండ్ల జాబితా రెండవ దశ కుల గణన జరుగుతుందన్నారు. జిల్లాలోని 21 మండలాలకు 2,043 మంది క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించామన్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు.