తాడిపత్రి: పెద్దపప్పూరు లో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
పెద్దపప్పూరు మండల కేంద్రంలో శనివారం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, మండల కార్యదర్శి చింతా పురుషోత్తం లు పలువురు సభ్యులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే కుల నిర్మూలన కోసం, సమాజ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు.