ఉరవకొండ: శీర్పి గ్రామంలోని దళితవాడలో గృహాల మధ్యన ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం శీర్పి గ్రామంలోని దళితవాడలో సోమవారం రాత్రి 8.20 నిమిషాలకు బలమైన ఈదురుగాలులతో చిరుజల్లులు పడే సమయంలో గృహాల మధ్యన ఏకాంబరేశ్వర అనే వ్యక్తి ఇంటి వెనక ఉన్న కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టు మొత్తం కాలిపోయి బూడిదయింది. పిడుగు పడిన సమయంలో కాలనీవాసులు ఇళ్లల్లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.