రాయదుర్గం: మహానాడు విజయవంతానికి నియోజకవర్గలో 12 క్లస్టర్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాయకుల వెల్లడి
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 27,28 న వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు నిర్వాహణకు రాయదుర్గం నియోజకవర్గంలోని 12 క్లస్టర్ లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. డి.హిరేహాల్ లో ఎన్టీఆర్, చంద్రబాబు కటౌట్ లతో ఆకట్టుకునే విధంగా సభా ప్రాంగణం తీర్చిదిద్దారు. గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం, రాయదుర్గం పట్టణంలోని టిడిపి కార్యాలయం, సీతారామాంజనేయ కళ్యాణమండపం, రూరల్ పరిధిలో పల్లేపల్లి, వడ్రహొన్నూరు గ్రామాలలో కణేకల్లు మండలంలోని మాల్యం, కణేకల్లు చిక్కణ్ణేశ్వర ఫంక్షన్ హాల్, బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాళ్ తదితర ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.