యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ఏప్రిల్ 15వ తేదీ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో అన్నా క్యాంటీన్ పనులను టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు పరిశీలించారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభంతో పేదలకు భోజన వసతి కలుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.