కొండపి: సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడ్డ కారు, కార్ డ్రైవర్ కి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై డివైడర్ని ఢీ కొట్టి కారు బోల్తా కొట్ట సంఘటన సోమవారం జరిగింది. ప్రమాదంలో కారు డ్రైవర్ కు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తుతో కారు నడపడం వల్లే కారు డివైడర్ ని ఢీ కొట్టి బోల్తా పడినట్లుగా పోలీసులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కారుని తొలగించి మరో ప్రమాదం జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.