మార్కాపురం: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి
మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ మహబూబ్ వలి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను వారికి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రధానంగా స్మశాన వాటిక, మంచినీటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. ఆ సమస్యలను జిల్లా కలెక్టర్ విజయ సునీత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.