యర్రగొండపాలెం: పెద్దారవీడు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో అరణ్య ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.