మార్కాపురం: రామచంద్రపురం గ్రామంలో మంచంపై నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు లాక్కెళ్ళినా గుర్తుతెలియని వ్యక్తులు
మార్కాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో తెల్లవారుజామున వెంకట లచ్చమ్మ ఇంటి ముందు వరండాలో మంచం పై నిద్రపోతుండగా గుర్తుతెలియని వ్యక్తి తన మెడలో బంగారు సరుడు లాక్కొని వెళ్ళిపోయారు. అదేవిధంగా కోటమ్మ ఇంటి ముందు వేప చెట్టు కింద మంచం పై పండుకొని ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని వెళ్లినట్లుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ అల్తాప్ హుస్సేన్, పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి ముద్దాయిల పట్టివేత కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు.