కొండపి: మర్రిపూడి మండలంలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఉక్క పోతనుంచి ఉపశమనం పొందిన ప్రజలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం లో సోమవారం వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కాగా అకస్మాత్తుగా వాతావరణం మార్పు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన వడగల్లు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాలలో అధికారులు ముందస్తు జాగ్రత్తతో వ్యవహరిస్తూ విద్యుత్ సరఫరాని నిలిపివేశారు.