తాడిపత్రి: ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పసుపుమయమైన యాడికి, ఎక్కడ చూసినా ఫ్లెక్సీ లే
యాడికి కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేములపాడు రోడ్డు మొత్తం పసుపుమయమైంది. దారి పొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 11.10 గంటలకు సీఎం హెలికాప్టర్లో యాడికి లోని వేములపాడు వద్దకు చేరుకుంటారని అధికారులు చెప్పారు. జిల్లా ఎస్పీ జగదీష్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.