కొండపి: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం; ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1.56 లక్షల చిన్నారులకు పల్స్ పోయే చుక్కలు పోయినట్లు తెలిపారు. రేపటి నుంచి ఆరోగ్యశాఖకు సంబంధించిన సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పోలియోని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్వామి అన్నారు.