రాయదుర్గం: డి.హిరేహాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కర్నాటక వాసి చికిత్స పొందుతూ మృతి
డి.హీరేహల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బళ్లారి జిల్లా వాసి విరుపాక్షప్ప(51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 29న మరో వ్యక్తితో కలసి బంధువుల పెళ్లికి హాజరయ్యి తిరిగి బైక్ పై వెళుతుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి తీవ్ర గాయాలపాలయ్యాడు. బెంగళూరు సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.