కొండపి: కొండపిలో కుక్కల దాడిలో మృతి చెందిన జింక, పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడి
ప్రకాశం జిల్లా కొండపి సమీపంలో శుక్రవారం కుక్కల దాడిలో జింక మీకు చెందింది. గ్రామ సమీపంలోని వైష్ణవి డైరీ వద్ద మంచినీరు తాగేందుకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో జింక మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం జింకకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.