రాయదుర్గం: పులకుంటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం పులకుంట గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన హరిజన పవన్ కుమార్, జ్యోతమ్మ, పవిత్ర, మల్లికార్జున, వడ్డే వెంకటేష్, వడ్డే రామాంజి అనే ఇరు వర్గాలకు చెందిన వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గుమ్మగట్ట ఎస్సై చిన్నరాయుడు ఆసుపత్రికి చేరుకొని ఘటనపై విచారణ చేపడుతున్న సమయంలో రెండు వర్గాల వారు వందలాది మంది ఆసుపత్రి ప్రాంగణంలో గుమికూడారు. రెండు వర్గాల వారూ గొడవకు దిగడంతో పోలీసులు ఇరువర్గాల వారని చెదరగొట్టారు.