గిద్దలూరు: గిద్దలూరు మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన హోంగార్డు ఓబులేసు, హైదరాబాదులో గుండెపోటుతో మృతి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం నల్లగట్లకు చెందిన ఓబులేసు గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ PSలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు ఓ టీ షాపులో ఒక్క సారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు స్పష్టం చేశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.