రాయదుర్గం: డి.హిరేహాల్ TDP నాయకుడు నీరుగంటి శంకరప్ప గుండెపోటుతో మృతి, నివాళులర్పించిన ఆర్య వైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు
డి.హిరేహాల్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నీరుగంటి శంకరప్ప శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు, పలువురు టిడిపి నాయకులు ఆదివారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి నాగళ్ళిరాజు మానవత్వం చాటుకున్నారు. పార్టీ తరపున ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.