నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో అరుదైన దృశ్యం, నెలవంక కింద ఆకాశదీపం వెలుగులు
Nandyal Urban, Nandyal | Nov 14, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రంలో అత్యంత అరుదైన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. కార్తీక మాసం శుక్రవారం రాత్రి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఈ దృశ్యం కనిపించింది. ధ్వజస్తంభంపై నెలవంక, ధ్వజస్తంభం కింద కార్తీకదీపం వెలుతురు కనిపిస్తూ, పరమేశ్వరుడి తలపై ఉన్న నెలవంక ధ్వజస్తంభంపై వెలసిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు.