యర్రగొండపాలెం: త్రిపురాంతకం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం నుండి జూనియర్ కాలేజ్ వరకు పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిశుభ్రం చేశారు. మండలంలోని 24 పంచాయతీలకు 42 నూతన మూడు చక్రాల రిక్షాలను ఆయన పంపిణీ చేశారు. పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ కార్మికులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.