మార్కాపురం: జిల్లా కేంద్రంలో 25 రూపాయల భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని నెహ్రూ బజార్ రాచపూడి పుల్లయ్య సత్రంలో దాతల సహకారంతో 25 రూపాయల భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎంతోమంది పేదలు పని కోసం మార్కాపురం వస్తూ వెళ్తూ ఉంటారు. వారికి 25 రూపాయల భోజనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దాతలు తదితరులు పాల్గొన్నారు