రాయదుర్గం: పట్టణంలో సర్ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పై ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వాహణ
రాయదుర్గం పట్టణంలో ముస్లిం సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని SIR, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ మొహమ్మద్ సైఫుల్లా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జామియా చౌక్ మసీదులో సాయంత్రం ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పట్టణంలోని మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.