మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తరచుగా జరుగుతున్న దొంగతనాలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. స్థానిక పేరంబజార్ కు చెందిన మాధవి గిద్దలూరు లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు నంద్యాల బస్సు ఎక్కుతుండగా సంచిలోని నల్లపూసల దండ ఉంగరం కమ్మలను దొంగలు అపహరించారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ చాలామంది ఫోన్లు బంగారు నగలు చోరీకి గురైన విషయం తెలిసినదే. బస్టాండులో భద్రత పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి చేశారు.