మార్కాపురం: విత్తన బంతుల తయారు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రావుఫ్
మార్కాపురం అటవీశాఖ ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో విత్తన బంతుల తయారీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రావుఫ్ మాట్లాడుతూ... చెట్లు పెంపకం పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన బంతులను తయారుచేసి మొక్కలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టు టైగర్ పరిధిలో 8 లక్షల విత్తనబంతులను తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.