రాయదుర్గం: పట్టణంలోని గోల్డ్ షాప్ ల వద్ద కర్నాటక పోలీసుల. హాల్ చల్
రాయదుర్గం పట్టణంలో కర్నాటక పోలీసులు హాల్ చల్ చేశారు. గురువారం ఉదయం నుంచి పట్టణంలోని గోల్డ్ షాపు ల వద్దకు వెళ్లి షాపు ఓనర్లతో మంతనాలు జరిపారు. నెలనెలా కర్నాటక నుంచి పోలీసులు రావడం ఇక్కడ గోల్డ్ షాపు యజమానులను భయబ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారిందని పలువురు గోల్డ్ షాపు యాజమానులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కర్నాటక పోలీసులు వచ్చి వారితో రహస్య మంతనాలు జరపడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్నాటక పోలీసు అధికారులు ఇటువంటి వారి కార్య కలాపాలపై దృష్టి సారించాలని స్థానిక వర్తకులు విజ్ఞప్తి చేశారు.